Monday 25 July 2016

నా ప్రేమ కధలు - రొమాంటిక్ ఇన్స్పిరేషనల్ లవ్ నోవెల్ బుక్ (త్వరలో)

నిజానికి మన లవర్ కి మనతో బ్రేకప్ చేసుకోవాలి అని ఆలోచన కూడా ఉండదు కానీ తన పక్కన ఉండే ఫ్రెండ్స్ వల్లే 99% బ్రేకప్స్ అవుతున్నాయి.... ఎలానో తెలియలా...?

టీం  #నా_ప్రేమ_కధలు - రొమాంటిక్ ఇన్స్పిరేషనల్ లవ్ నోవెల్ బుక్ (త్వరలో)

Like the Page n Support us
https://m.facebook.com/Na-Prema-Kadhalu-157084594713368/

Sunday 24 July 2016

నా ప్రేమ కధలు - రొమాంటిక్ ఇన్స్పిరేషనల్ లవ్ నోవెల్ బుక్

నిజానికి మన లవర్ కి మనతో బ్రేకప్ చేసుకోవాలి అని ఆలోచన కూడా ఉండదు కానీ తన పక్కన ఉండే ఫ్రెండ్స్ వల్లే 99% బ్రేకప్స్ అవుతున్నాయి.... ఎలానో తెలియలా...?

టీం  #నా_ప్రేమ_కధలు - రొమాంటిక్ ఇన్స్పిరేషనల్ లవ్ నోవెల్ బుక్ (త్వరలో)

Like the Page n Support us https://m.facebook.com/Na-Prema-Kadhalu-157084594713368/

Saturday 23 July 2016

నాన్న ప్రేమకు.. అమ్మ ప్రేమకు.. ఉన్న తేడా ను ఎలా చెప్పారో చూడండి - నవీన్ ముళ్ళంగి

నాన్న అనే పదం ఒక కూతురికి అంటే అమ్మాయిలకు ఒక గొప్ప పదం వారు పుట్టిన దగ్గరి నుంచి వారి భర్త ఇంటికి వెళ్ళేవరకు నాన్న వారిని ప్రేమగా చూసుకుంటారు కానీ మా అబ్బాయిలకు అలా ఉండదు ఎందుకంటె మేము చేసే తీట పనులకు కొడతారు కనుక 😂 కానీ  నేను అబ్బాయి కాబట్టి నాకు తెలిసిన వరకు నాన్న కు అమ్మ కు ఉన్న తేడా చెప్తాను.

నాన్న ఎప్పుడు తన పనికి వెళ్తూ ఉంటాడు కానీ అమ్మ మాత్రం పిల్లలతో కలిసి ఉంటుంది ఎప్పుడు...
నాన్న మనం ఏ తప్పు చేసిన తిడతాడు కొడతాడు ఇంకోసారి మనం ఆ ప్రమాదం లో పడొద్దని...కానీ అమ్మ ఎప్పుడు కొట్టకుండా ఆపుతుంది అందుకే అమ్మ అంటే మనకు అంత ఇష్టం...
అమ్మ మనల్ని కని, పెంచుతుంది ఇందులో నాన్న భాద్యత ఏమి లేదు అనిపిస్తుంది...
కానీ కనటం అమ్మ వంతు అయినా.. మన జీవితం గురుంచి కళలు కనటం నాన్న వంతు.......
మనల్ని పెంచేది అమ్మ అయిన మనం భాద్యత తెలిసి పెరగటం నాన్న వల్లనేనని....
ఇది కొంతమందికి మాత్రమే అర్ధమవుతుంది...
మనకు పని చేయటం అమ్మ వంతు అయితే మన మనం చేసే పనులను సరిచేయటం నాన్న వంతు....
అమ్మకు ఎప్పుడు మనలో ఉన్న మంచి అలవాట్లే కనిపిస్తాయి...కానీ నాన్నకు మన చెడు అలవాట్లు కూడా అర్థమవుతాయి
మనల్ని ప్రేమించటం అమ్మ వంతు అయితే మనకి అన్ని వచ్చేలా నేర్పించటం నాన్న వంతు...
ఆకలి తీర్చటం అమ్మ వంతు అయితే మన ఆశలు తీర్చటం నాన్న వంతు...
అమ్మ ప్రేమ అందరికి కనిపిస్తుంది అందుకే అందరు దాని గురుంచి మాట్లాడతారు కానీ నాన్న ప్రేమ ఎప్పుడూ అతను మనసులోనే ఉంటుంది... అలా ఉంటేనే మనం మంచి దారిలో నడుస్తాం అని అతనికి తెలుసు...
అమ్మ కు మన సంతోషం గురుంచి ఆలోచిస్తుంది కానీ నాన్న మన క్షేమం గురుంచి ఆలోచిస్తాడు...
అమ్మను తిడితే తను ఎడుస్తుంది కానీ నాన్నను తిడితే తనలో తను బాధ పడతాడు..
మనకు కనిపించే కష్టం అమ్మది...మనకు కనిపించని కష్టం నాన్నది...
అమ్మకు సపోర్ట్ ఎక్కువ....
నాన్న కు కోపం ఎక్కువ....
అందరు పొగిడేది అమ్మ ను....
అందరు వదిలేసేది నాన్నను....
అమ్మ పిల్లల కడుపు నిండేలా చూస్తుంది...నాన్న పిల్లల జేబు నిండేలా చూస్తాడు...
అందుకే ప్రతి మగాడికి తన భార్య ప్రిన్సెస్ కాకపోవచ్చు కానీ కూతురు మాత్రం ప్రిన్సెస్...! ఇందులో ఇంకోటి ఉంది అతను తన కూతుర్ని ప్రేమించినట్టు కొడుకును కూడా ప్రేమించలేరు అది మరి నాన్న అంటే....
అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోకి తెస్తుంది కానీ నాన్న ఈ ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు
అందుకే
నాన్న ...నువ్వు లేనిది నేను లేను మన కుటుంబం లేదు... లవ్ యు నాన్న #నవీన్_ముళ్ళంగి

Did you know 'Naveen Mullangi' Got Best Actor Award in 'Its9 blog' Short film competition with winning over 1550+ other sf's... Through out Nation

Naveen Mullangi Got Best Actor Award in It9 short film competition 2k16 with fighting 1550+ short films in Telugu, Hindi, Tamil and English. He Made it not only by his Outstanding Performance but also from Massive support from Public through comments on post of Nominations.
Absolutely it is a One Man Show.
Checkout Other Winners Here on Awards page http://itss9.blogspot.in/p/its-9-short-film-awards.html?m=1

Friday 22 July 2016

ఈ రోజుల్లో స్నేహం ఎలా ఉందో చెప్పిన విధానం చూడండి - నవీన్ ముళ్ళంగి

ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే కలిసి సినిమాల కెళ్లటం రెస్టారెంట్ లకు వెళ్ళటం క్రికెట్ గ్రౌండ్ కు వెళ్ళటం మందు కొట్టడం స్మోక్ చేయటం తిరగటం...వీటితో పాటు మనం బెస్ట్ ఫ్రెండ్స్ బ్లడ్ ఫ్రెండ్స్ అనుకోవటం....... ఎందుకంటే కాలేజీ లో నోట్స్ రాయటానికి హెల్ప్ చేసావ్....కలిసి sir ని టీజ్ చేసాం.... మన అఫైర్స్ గురుంచి మాట్లాడుకుంటాం ఓపెన్ గా ....ఎవరైనా ప్రొపోస్ చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేసి చేయనట్టు వెంటతిప్పుకోవటానికి టిప్స్ చెప్పటం ఇంకా గోవా, సింగపూర్ ట్రిప్స్ వేయటం etc....పనికి రాని పనులు....నిజంగా ఒక మనిషికి సహాయం కావాలంటే వేరే ఒక్క మనిషి కూడా రారు...పేదరికంలో చనిపోతున్న పట్టించుకోరు....నమ్మరా...అయితే మీరు బీర్ తాగలంటే అందరు డబ్బులు వెసుకుని తెచ్చుకుంటారు కానీ ఈ సారి ఆ డబ్బులను బీర్లకు కాకుండా అనాధఆశ్రమంలో ఫుడ్ ఇద్దాం అని అనండి లేదా ఎవరైనా లేని వాళ్లకు ఆ మనీ తో రైస్ కొనిద్దాం అనండి...ఇలా ఒక రెండు సార్లు అనండి...వారు అందరు ఒప్పుకుంటే కచ్చితంగా మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఒక్కరు కూడా వద్దు అనొద్దు... ఈ రోజుల్లో టైం పాస్ కి ఫ్రెండ్షిప్ బెస్ట్ వే అందరు చేసేది అదే కానీ ఒప్పుకోరు ఎందుకంటే ఎక్కడ అవతలి వారు వెళ్ళిపోతారో నేను ఒంటరిగా ఉంటానేమో అని....అయిన అందరికి తెలిసిందే...డబ్బులు లేని వాడికి ఫ్రెండ్స్ ఉండరు....మనిషి ఎప్పుడైనా ఒక తోడు కోసం ఫ్రెండ్షిప్ చేస్తాడు తప్ప ఇంకేమి లేదు....ఇలా....99.99% ఉన్నారు....నాకు తెలుసు మీరు ఆ 0.1% లో ఉన్నాం అనుకుంటున్నారు... నా ప్రకారం మీకు ఆ డౌట్ వచిందంటె అసలు మీరు ఫ్రెండ్షిప్ లో లేనట్టు ఎందుకంటే నిజంగా ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇచ్చి ఆ ఫ్రెండ్షిప్ ఇన్స్పిరేషన్ తో పైకి వచ్చి, రాబోతున్న వారు "స్మోక్ చేయటం తిరగటం" వరకు రాగానే వేరే వాళ్ళ గురుంచి అనుకుని చదవటం కంటిన్యూ చేస్తారు......మరి మీరు ఏమనుకున్నారు ? నాకు చెప్పాల్సిన అవసరం లేదు.. మీకు తెలిసి ఒక క్లారిటీ వస్తే చాలు #నవీన్_ముళ్ళంగి

భావోద్వేగాలను మనలో నిద్రలేపే మాటలు - 'తెలంగాణ' మీద

తెలంగాణ రాష్ట్రము విడిపోవడం నిజంగా నాకు చాల సంతోషాన్ని ఇచ్చింది...ముందు పూర్తిగా చదువు ఆ తర్వాత కామెంట్ పెడుతువు కానీ......ఎందుకంటే అసలు ఆంధ్ర వారు మనలో భాగము కాదు వారు బ్రిటీష్ వారిచే పరిపాలించ బడ్డారు మరియు మనం నిజాం రాజుల చేత పరిపాలించబడ్డాము.మీరు గమనిస్తే మన తెలంగాణ యాస లో బాషలో ఉర్దూ వాసన వాస్తు ఉంటుంది కానీ ఆంధ్ర వారు బ్రిటీష్ వారిచే పరిపాలించబడటం వాళ్ళ వారికీ ఇంగ్లీష్ త్వరగా వచ్చింది. మనకు మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. పెద్ద మనుషుల ఒప్పందం లో మన వారు భయపడ్డారు ఎందుకంటే వారూ చదువుకున్నవారు మరియు వ్యవసాయం లో ముందు ఉన్నారు వారి నీటి లభ్యతవల్ల కానీ మేము కరువు లోనే బ్రతికాము సాయుధపోరాటం లొనే మా జీవితాలు గడిచి పోయాయి మరి మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని ఆ రోజే అడిగారు కానీ అప్పుడున్న కొంతమంది వారిని బుజ్జగించి నమ్మించి ఒప్పందానికి ఒప్పించారు.ఆ తర్వాత మనకి జరిగిన అన్యాయం అందరికి తెలుసు కొన్ని వందల మంది శ్రీ కాంతచారి వంటి యువకులు ఆత్మహత్యలు చేస్కుని కెసిఆర్ లాంటి నాయకులూ నిరాహార దీక్షలు చేస్తే సరిగ్గా ఎన్నికల సమయంలో వారి కొడుకుని ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చో పెట్టడానికి ఎం.పి సీట్ల కోసం ఇచ్చారు కానీ ఫలితం మన అందరికి తెలుసు ప్రజలు పోరాడిన వారికీ పట్టం కట్టారు..ఇచ్చామని చెప్పుకున్న వారికీ కాదు. మా తెలంగాణ మహా గర్జనకు వరంగల్లో 15లక్షల మంది వస్తే టైమ్స్ అఫ్ ఇండియా వారు క్విట్ ఇండియా ఉద్యమంతో పోల్చారు మరి అది మీ ఛానల్లకు మీకు కనిపించలేదా ఎవరైనా నాయకుడు మాట్లాడుతుంటే కరెంటు కూడా తీయటం మీకే చెల్లింది నన్ను విభేదించే వారిని ఒక్క మాటే అడుగుతా ఆంధ్ర లో  ఎయిర్పోర్ట్ లు  విశాఖపట్నం లో కడప లో విజయవాడ లో పుట్టపర్తి లో  రాజమండ్రి లో తిరుపతి లో దోనకొండ లో (నాన్ ఆపరేషనల్) విజయపురి గుంటూరు లో (ప్రైవేట్) ఇన్ని ఎయిర్పోర్ట్ లు ఆంధ్రాలో ఉన్నాయి మరి మన తెలంగాణ లో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఎక్కడేన ఉన్నాయా మరి ఇలాంటివి చూసినపుడు మా గుండెలు మండవా మా పిల్లల బ్రతుకులు బాగుపడాలని వారికీ ఉద్యోగాలు రావాలని మా వ్యవసాయానికి నీళ్లు రావాలని బీడు పరిపోతున్న మా భూములను చూసి గుండెలు పగిలేలా ఏడ్చాము..ప్రాణాలు పోయిన పర్వాలేదు అని పోరాటం చేసాము తెలంగాణ సాధించుకున్నాము. మీకు విడిపోవటం బాధగా ఉంటె మాకు మా బ్రతుకులు చూసి బాధగా ఉంది అయిన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మమ్ములను బానిసలుగా చుసిన వారికీ మా ఆదాయాన్ని తీస్కెళ్లి వారిని అభివృద్ధి చేసుకొని మమ్మలిని అంధకారం లో కి నెట్టిన వారికీ మేము వ్యతిరేకం. అయిన మా బతుకమ్మ మీకు విడిపోయే రోజుల ముందు గుర్తొచిందా మా యాస కు గౌరవం ఇచ్చి మనం అందరం తెలుగు అని విడిపోయే ముందు గుర్తొచిందా... నా బాషా నా యాస మీద వేసిన జోక్లు మర్చిపోయారా...ఏది ఏమైనా ఎవరు ఎమన్నా నేను తెలంగాణ వాణ్ణి.... తెలంగాణాలో పుట్టా.. తెలంగాణ లో పెరిగా...తెలంగాణ లొనే చస్తా....నా తల్లి తెలంగాణ నీకు పాదాభివందనం.... జై తెలంగాణ...జై హింద్..#నవీన్_ముళ్ళంగి

నా దేశం - నా సైనికుడు

ఎవరైనా సెలబ్రిటీ చనిపోతే వారికీ గౌరవలాంచనాలతో అంతిమ యాత్రకు సాగానంపుతారు. మరి వీరు ఏమి పాపం చేసారు.. నీకోసం నీ కుటుంబం కోసం రాత్రి పగలు తేడాలేకుండా బోర్డర్ లో తన ప్రాణాలను లెక్కచేయకుండా కాపలాకాస్తుంటారే మరి వారు చనిపోతే కేవలం టీవీ లో స్క్రోలింగ్ లెక్కల్లో ఇంకో నెంబర్...సిగ్గు ఉండాలి కొంచమైనా ఆ టెర్రరిస్ట్ ****కొడుకులకు సపోర్ట్ గా మాట్లాడడానికి...వాడు ఎవడో నిన్న పుట్టిన ద్రోహి మీద పాట రాస్తే దాన్ని పెద్ద ఏదో వింతలా చూసారు. మరి నా దేశ సైనికుడు తన ప్రాణాలు నీకోసం వదిలేస్తున్నాడు దానికి ఏమి ఇవ్వాలి.. పాకిస్థాన్ బోర్డర్ లో నా దేశ సైనికులను కాల్చి చంపుతుంటె అవి టి.వి లో ఈ రోజు ఇద్దరు జవాన్లు మృతి..ఈ రోజు ముగ్గురు జవాన్లు మృతి అని వింటునపుడు......గుండె మండి కళ్ళు ఎరుపెక్కిన వారిలో నేను ఒకన్నీ...ఒక పక్క 5 నిమిషాల్లో మేము ఢిల్లీని నాశనం చేసే సత్తా ఉన్న ఆయుధాలను సిద్ధం చేసుకున్నాం అని రెచ్చకొడుతున్న ఓపిక తో ఉన్నాం.. ఎందుకంటే మేము తలుచుకుంటే 5 నిముషాలు మాకు చాలా ఎక్కువ...కానీ మీలా కయ్యానికి కాలుదువ్వె వాళ్ళం కాదు... మీరు మీ దేశాన్ని బాగు చేసుకోవటం చేతకాక కాశ్మీర్ మీదకు ప్రజలను డైవర్ట్ చేసి మా దేశం మీద విషం చిమ్ముతూ మా ప్రజలను శత్రువులుగా చూపించి..మీ ఎన్నికల్లో గెలుస్తున్నారు...కానీ ఏదో ఒక రోజు వారికీ అర్ధం అవుతుంది మీ అతినీచమైన రాజకీయ ప్రయత్నం...ఆ రోజు వారె మిమ్ములను చెప్పులతో చూసుకుంటారు...ఇది నా దేశం... నేను పుట్టిన దేశం ... నాకు ఈ ప్రపంచంలో ఒక గుర్తింపు ఇచ్చిన దేశం...నా ప్రాణం కన్నా నా దేశమే ఎక్కువ....నాలా చాల మంది పుడతారు పోతారు నా దేశం లేనిదీ వారు ఎవరు లేరు....ఇంకో సారి నా భారతదేశం గురుంచి కానీ నా సైనికుల గురుంచి కానీ తప్పుగా మాట్లాడితే.....నీకు ఇక్కడ ఉండే నైతిక హక్కు కోల్పోతావ్.....ఆల్రెడీ కోల్పోయావ్....నీలాంటి వారిని ఎంతమందిని చూసి ఉంటాం మా సంస్కృతి మీద మా మత సామరస్యం మీద దాడి చేయాలనీ చూసినవారిని....మా సంస్కృతి లో నీకు తప్పులు కనపడితే మా దేశం లో నీకు అసహనం కనపడితే నువ్వు ఈజిప్ట్,ఆఫ్కానిస్థాన్,సిరియా,పాలస్తీనా,కొరియా వెళ్లొచ్చు..నీ మాటలు మాకు అవసరం లేదు......మా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం అవసరమైతే తీస్తాం......మా దేశం...జై జవాన్..జై కిసాన్ #నవీన్_ముళ్ళంగి



Thursday 21 July 2016

'Na Prema Kadhalu' Telugu Novel/Book by Author,Short Filmmaker - Naveen Mullangi

'Na Prema Kadhalu' is a Novel/Book Under Construction by Author - Naveen Mullangi

it is his Debut Novel Book. This book is about a middle class boy who is failed in love.... several times and got inspired by them. overall story deal with how he raised in his life, what are the troubles in life and who is his Girl friend and who married him. 

We are Here...!  #Like us on Facebook Page '#Na_Prema_Kadhalu' and Support us. https://m.facebook.com/Na-Prema-Kadhalu-157084594713368/

This Book will cheer you up in your life n If you are a Love Failure....!!?? You have to read it must

Book - Na Prema Kadhalu (Book Coming Soon)

Author - Naveen Mullangi

Language - Telugu

Subject - Romantic Love Thriller